Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కట్టడికి కఠిన చర్యలు : ఎమ్మెల్సీ కవిత

Webdunia
ఆదివారం, 9 మే 2021 (12:53 IST)
హైదరాబాద్, మియాపూర్‌లోని కల్వరి టెంపుల్‌లో ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను తెరాస ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తెరాస ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. అంకురా హాస్పిటల్, థెరిస్సా హాస్పిటల్‌ల సౌజన్యంతో ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇక్కడ కరోనా పేషెంట్లకు చికిత్స, మందులు, నాణ్యమైన భోజనం సహా అన్నీ ఉచితంగానే అందించనున్నారు. 
 
ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు, సానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బెడ్ లు అందుబాటులో ఉంచడంతో పాటు, ఆక్సిజన్, వెంటిలేటర్ లకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 
 
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. కరోనా పేషెంట్లకు ఉచితంగా భోజనం అందిస్తున్న బ్రదర్ సతీష్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. సోమవారం నుండి ఇక్కడ కోవిడ్ పెషెంట్లకు చికిత్స అందించనున్నారు. 
 
నిత్యం 100 కు పైగా వైద్య సిబ్బంది ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో సేవలందించనున్నారు. 300 పడకల ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో, 50 ఆక్సిజన్ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments