Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థాట్‌స్పాట్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో, మోడ్రన్‌ ఎనలిటిక్స్‌ క్లౌడ్‌ కోసం డియోట్టాను సొంతం చేసుకుంది

Advertiesment
ThoughtSpot
, బుధవారం, 5 మే 2021 (20:36 IST)
ఆధునిక ఎనలిటిక్స్‌ క్లౌడ్‌ కంపెనీ థాట్‌స్పాట్‌ నేడు తాము మోడ్రన్‌ డాటా ఇంటిగ్రేషన్‌ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు నిశ్చయాత్మక ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఎక్వైజేషన్‌తో ఉత్తర అమెరికా మరియు భారతదేశాలలోని 60 మందికి పైగా నూతన ఉద్యోగులు థాట్‌స్పాట్‌లో చేరడంతో పాటుగా మోడ్రన్‌ ఎనలిటిక్స్‌ క్లౌడ్‌ అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నారు. అంతేకాకుండా సంస్థ అంతర్జాతీయ ఆర్‌ అండ్‌ డీ బృందానికి 25% అదనపు ఉద్యోగులు జోడించబడడంతో పాటుగా భారతదేశంలోని ఆర్‌ అండ్‌ డీ బృందానికి 50% అదనపు ఉద్యోగులు జోడించబడతారు. దీనితో పాటుగా హైదరాబాద్‌లో సంస్థ తమ పాదముద్రికలను విస్తరించనుంది. థాట్‌స్పాట్‌కు ఇప్పుడు భారతదేశంలో 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
 
వినియోగదారుల ఆధునిక డాటా స్టాక్‌లో అత్యుత్తమ సేవలతో థాట్‌స్పాట్‌ వేగంగా తమ అనుసంధానతలను విస్తరించేందుకు డియోట్టాతో నూతన అనుబంధం తోడ్పడుతుంది. తమ ఆధునిక క్లౌడ్‌ నిర్మాణంలో భాగంగా వినియోగదారులు ఎలాంటి అసౌకర్యం లేకుండా థాట్‌స్పాట్‌ను సజావుగా రంగంలోకి దింపడంతో పాటుగా తమ వ్యాపారానికి తక్షణ విలువనూ అందించగలరు.
 
మరీ ముఖ్యంగా, డియోట్టాను సొంతం చేసుకోవడం ద్వారా వెబ్‌ డెవలపర్లు నిర్మించిన మోడ్రన్‌ డాటా ప్లాట్‌ఫామ్స్‌, ఏఐ, ఎంఐ సేవలు మరియు డాటా అప్లికేషన్లుతో విలీనాలు వేగవంతం అవుతాయి. ప్రపంచంలో అగ్రశ్రేణి టెక్నాలజీ ఎనలిస్ట్‌ సంస్థలలో ఒకటైన సొల్యూషన్స్‌ రివ్యూ విడుదల చేసిన టాప్‌ 5 డాటా ఇంటిగ్రేషన్‌ వెండార్లలో ఒకటిగా డియోట్టా గుర్తించబడింది. అంతేకాదు, డియోట్టా యొక్క ప్రతిభావంతులకు  ఆధునిక వ్యాపారాలు ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన సవాళ్లను సైతం పరిష్కరించే డాటా ఉత్పత్తులను నిర్మించే అసాధారణ నైపుణ్యం ఉంది.
 
మరిన్ని నవీన ఆవిష్కరణలు డాటా మార్కెట్‌ప్లేస్‌ను పునః రూపకల్పన చేస్తున్నందున, వినియోగదారులకు వారి నిర్థిష్ట సవాళ్లను పరిష్కరించడానికి పరిశ్రమ అందించే ఉత్తమమైన అంశాలనుంచి నిర్మించిన కస్టమ్‌ స్టాక్‌ను ప్రభావితం చేసే సామర్థ్యం అవసరం. థాట్‌స్పాట్‌ రూపొందించిన ఆధునిక ఎనలిటిక్స్‌ క్లౌడ్‌ సంస్థలకు కన్స్యూమర్‌ గ్రేడ్‌ ప్లాట్‌ఫామ్‌‌ను ఈ నూతన డాటా వ్యవస్థతో అనుసంధానించబడేందుకు అందిస్తుంది. కంపెనీలు తమ ప్రాధాన్యతలకనుగుణంగా డాటా స్టాక్‌ను నిర్మించుకోవచ్చు మరియు ఆ తరువాత తమ ఉద్యోగులు, వినియోగదారులు, భాగస్వాములను శక్తివంతం చేస్తూనే ఈ పెట్టుబడుల ప్రయోజనాలను సరళమైన, ఓపెన్‌ మరియు యాక్షనబుల్‌ ఎనలిటిక్స్‌ వేదిక ద్వారా తీసుకోవచ్చు.
 
డియోట్టాను సొంతం చేసుకోవడం వల్ల మోడ్రన్‌ ఎనలిటిక్స్‌ క్లౌడ్‌ కోసం అనువైన వాతావరణం వేగంగా విస్తరించవచ్చు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానంతో థాట్‌స్పాట్‌ యొక్క ఎనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ అనుసంధానించడానికి, సమగ్రపరచడానికి సహాయపడుతుంది.
 
‘‘తమ వ్యాపార కార్యకలాపాలకు తమ డాటాను మిళితం చేసుకోవడంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన సవాళ్లను పరిష్కరించుకోవడంలో తమ వినియోగదారులకు సహాయపడటంలో డియోట్టా చేసిన కార్యకలాపాలకు మేము అభిమానులం. డియోట్టా యొక్క బృందం శక్తివంతమైన, సూక్ష్మ పర్యావరణ వ్యవస్థను సైతం అర్థం చేసుకోవడంతో పాటుగా ప్రక్రియలను నడిపేందుకు మరియు నిర్ణయాధికారాన్ని మార్చుకోవడానికి కంపెనీలు తమ డాటాపై ఆదారపడే విధానంలో భాగంగా ఎదుర్కొంటున్న వినూత్నమైన సమస్యలను అర్థం చేసుకుంటుంది’’ అని సుమీత్‌ అరోరా, చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, థాట్‌స్పాట్‌ అన్నారు.
 
‘‘మోడ్రన్‌ ఎనలిటిక్స్‌ క్లౌడ్‌తో మేము మా వినియోగదారులకు మరింత విలువను జోడిస్తున్న వేళ, డియోట్టా యొక్క అనుభవం మరియు ప్రజలు, ప్రక్రియలు మరియు డాటాను ఏకతాటిపైకి తీసుకురావాలనే భాగస్వామ్య దృష్టి ఒక సంపూర్ణ పూరకంగా ఉంటుంది’’ అని అన్నారు.
 
‘‘థాట్‌స్పాట్‌ మరియు డియోట్టాలు భారీ, భాగస్వామ్య వ్యాపార వినియోగదారులను కలిగి ఉన్నాయి. ఈ వీలనంతో మేము మరింత సమగ్రమైన అప్లికేషన్‌లను క్లౌడ్‌ ఎనలిటిక్స్‌ సౌకర్యవంతంగా మార్చేందుకు అందించడానికి ఉన్న అవకాశాలను అన్వేషించనున్నాం. నేడు కంపెనీలు డాటా చేత నిర్వహించబడుతున్నాయి. ప్రతి ఆధునిక సంస్ధలోనూ ఇది కీలకంగా ఉంది. థాట్‌స్పాట్‌తో చేతులు కలుపడం ద్వారా, ఈ వ్యాపార సంస్థలు తమ బృందాలను డాటాతో శక్తివంతం చేయడంలో తాము ఏ విధంగా తమ సహాయాన్ని విస్తరించగలమో చూడనున్నాం’’ అని సంజయ్‌ వ్యాస్‌, సీఈవో అండ్‌ కో–ఫౌండర్‌, డియోట్టా అన్నారు. ‘‘ఆధునిక ఎనలిటిక్స్‌ క్లౌడ్‌ డాటా పర్యావరణ వ్యవస్థలో అత్యంత అధునాతనమైన ఆవిష్కరణలను ప్రతి ఉద్యోగి చేతిలో పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యీకరిస్తుంది. ఈ ముఖ్యమైన లక్ష్యాన్నిముందుకు తీసుకువెళ్లడంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధైర్య పడకండి మేమంతా మీకు ఉన్నాం: కరోనా రోగులతో చెవిరెడ్డి