Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారును పోలిన గుర్తు దుబ్బాకలో తెరాస కొంపముంచిందా?

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (18:54 IST)
‌ దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట‌మికి ఆ గుర్తు కార‌ణ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కారును పోలిన గుర్తును స్వ‌తంత్ర అభ్య‌ర్థికి కేటాయించారు. దీంతో దుబ్బాక ఓట‌ర్లు క‌న్ఫ్యూజ్ అయి.. కారును పోలిన సింబ‌ల్‌కు ఓటేయ‌డంతో కొంత న‌ష్టం క‌లిగి ఉండొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
 
ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,64,186 ఓట్లు పోల‌వగా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోల‌య్యాయి. ఇక స్వతంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజు అనే అభ్య‌ర్థికి 3,489 ఓట్లు ప‌డ్డాయి. ఈ మూడు పార్టీల త‌ర్వాత నాగ‌రాజు నాలుగో స్థానంలో నిలిచాడు.
 
కారును పోలిన సింబ‌ల్‌ను నాగ‌రాజుకు కేటాయించ‌డంతోనే టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన ఓట్ల‌న్ని అత‌నికి ప‌డ్డాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోల‌వ్వ‌గా, అందులో 1381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments