రసూల్‌పురా - రాంగోపాల్ పేట మధ్య ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (08:50 IST)
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ముఖ్యంగా బేగంపేట పరిధిలోని రసూల్‌పురా - రాంగోపాల్ పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు నెలల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 
 
ఈ ట్రాఫిక్ ఆంక్షలు బుధవారం నుంచి వచ్చే యేడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆక్షలు అమల్లో ఉంటాయన్నారు. రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆస్పత్రి, మినిస్టర్ రోడ్డు, రాణింగజ్, నల్లగుట్ట వైపు వెళ్లే వాహనాలు సిటీవో ఫ్లై ఓవర్ వరకు వెళ్లి యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 
 
అలాగే, బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి కిమ్స్ ఆస్పత్రి, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట, వీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా - టి జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునేందుకు అనుమతించరని తెలిపారు. అదేవిధంగా రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా వైపు అనుమతించరు.
 
అటువైపు వచ్చే వాహనాలు ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా రసూల్‌పురా రావొచ్చు. సికింద్రాబాద్ నుంచి కిమ్స్ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ టెంపుల్ నుంచి ఎడమవైపు టర్న్ తీసుకుని ఫుడ్‌వరల్డ్ మీదుగా కిమ్స్ ఆస్పత్రి వైపు వెళ్లొచ్చు. 
 
లేదంటే సీటీవో ఫ్లై ఓవర్ నుంచి ఎడమవైపు టర్న్ తీసుకుని రాణిగంజ్ మీదుగా కిమ్స్ వైపు వెళ్లొచ్చు. అంబులెన్స్‌లు కిమ్స్‌కు వెళ్లేందుకు బేగంపేట ఫ్లై ఓవర్ పై నుంచి సీటీవో ఫ్లై ఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకుని గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments