Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రాఫిక్‌ను లెక్క చేయలేదు.. సర్జరీ కోసం 3కిలోమీటర్లు పరిగెత్తాడు.. (వీడియో)

Doctor
, సోమవారం, 12 సెప్టెంబరు 2022 (17:41 IST)
Doctor
ట్రాఫిక్‌కు బెంగళూరు బాగా ఫేమస్. తక్కువ దూరాలను కవర్ చేయడానికి ఈ ట్రాఫిక్ కారణంగా చాలా ఎక్కువ సమయం పడుతుంది. అయితే తాజాగా ఓ రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ వైద్యుడు ట్రాఫిక్‌ను లెక్క చేయలేదు. మూడు కిలోమీటర్ల మేర పరిగెడుతూ.. ఆస్పత్రికి చేరుకున్నాడు. ఈ వైద్యుడి స్ఫూర్తిదాయకమైన స్టోరీ సంగతి ఏంటంటే?
 
వివరాల్లోకి వెళితే, మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30న అత్యవసర లాపరోస్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్స చేసేందుకు వెళుతుండగా సర్జాపూర్-మారాతల్లి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు.
 
ఆలస్యమైతే మహిళా రోగికి హాని కలుగుతుందని గ్రహించిన డాక్టర్ నందకుమార్ తన కారును వదిలి మూడు కిలోమీటర్లు పరిగెత్తి కీలకమైన శస్త్ర చికిత్స చేశారు. అతను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన రన్ యొక్క చిన్న క్లిప్‌ను కూడా పోస్ట్ చేశాడు. 
 
రోగి పరిస్థితి క్లిష్టంగా మారడంతో సర్జాపూర్‌లోని మణిపాల్ హాస్పిటల్స్‌కి పరిగెత్తానని చెప్పారు. సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లే సరికి అంతా సిద్ధంగా వుందని చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Captain Cool.. తరుముకొచ్చిన ఏనుగు.. రివర్స్‌లోనే కారును నడిపిన డ్రైవర్ (Video)