హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు కూలీల మృతి

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:31 IST)
హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న అశోక్ ట్రాలీ వాహనాన్నీ లారీ ఢీకొనడంతో ఏర్పడిన ఈ ప్రమాదంలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
వివరాల్లోకి వెళితే.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చీ తోటలో పనికి వెళ్లేందుకు ట్రాలీ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ట్రాలీని ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు తీవ్రగాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

తర్వాతి కథనం
Show comments