Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామారెడ్డిలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Advertiesment
కామారెడ్డిలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
, సోమవారం, 28 మార్చి 2022 (13:11 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ (ఎం) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్ ఒకటో డిపోకు చెందిన బస్సు కామారెడ్డి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
బస్సు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కారులోని మరో బాలిక తీవ్రంగా గాపయడింది. ఆ బాలికను ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. టైరు పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందమే ఆమెకు ఆయుధం.. పెళ్లి చేసుకుని శోభనం రోజు రాత్రి..?