Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ సైన్యం నుంచి షర్మిలా రెడ్డి సైన్యానికి బెదిరింపు కాల్స్, ఫిర్యాదు

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (15:36 IST)
షర్మిలా రెడ్డి. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో వచ్చే నెల 9న పార్టీ ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈమె పార్టీ గురించి తెరాస, భాజపాలు అస్సలు పట్టించుకోవడంలేదు. ఆమధ్య హరీశ్ రావు ఎవరో వచ్చి పార్టీ పెడతామంటుండ్రు అనే ఒక్క మాట తప్పించి తెరాస నుంచి షర్మిల గురించి ఎవ్వరూ వ్యాఖ్యానించడంలేదు. మరోవైపు భాజపా సైతం షర్మిలకు తెలంగాణలో అంత సీన్ లేదని చెపుతున్నారు.
 
కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి మాత్రం రియాక్ట్ అయ్యారు. సీమాంధ్రకు చెందిన కొందరు ఇచ్చే పైసల కోసం షర్మిల పార్టీ పెడుతున్నారనీ, వారి పప్పులు ఇక్కడ వుడకవంటూ వ్యాఖ్యానించారు. ప్రజల్లో హైప్ క్రియేట్ చేయడానికి షర్మిల తమ నాయకుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని రేవంత్ సైన్యం ఆరోపిస్తుంది. ఇంకోవైపు రేవంత్ సైన్యం నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ షర్మిలా రెడ్డి సైన్యం ఆరోపిస్తోంది. విషయాన్ని డిజిపికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
 
ఇదిలావుంటే గోనె ప్రకాశరావు అయితే తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పార్టీలు పెట్టిన చిరంజీవి, దాసరి పరిస్థితి ఏమయ్యిందో చూశాం కదా. షర్మిల రాజకీయాలు మానుకుని హాయిగా సొంత పనులు చూసుకోవడం మంచిదని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments