Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"అర్జున్ రెడ్డి" నటి శ్రీసుధపై హత్యాయత్నం?

Advertiesment
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:51 IST)
అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన శ్రీసుధపై హత్యాయత్నం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై ప్రమాదానికి గురైంద. ఇది ప్రమాదం కాదని, ఖచ్చితంగా హత్యాయత్నమని పేర్కొంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, గతంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆమె కారు ప్రమాదానికి గురికావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవరిపై తన కారు ప్రమాదనికి గురైందని, అయితే ఇది యాక్సిడెంట్ కాదని, తనను చేయడానికి చేసిన కుట్ర అని పేర్కొంటూ శ్రీసుధ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యాక్సిడెంట్ వెనక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు కుట్ర దాగి ఉందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది.
 
సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీ సుధ లైంగిక ఆరోపణలు చేస్తూ గతంలో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ ఆమె పేర్కొంది. ఈ విషయమై అప్పట్లో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో శ్యామ్ కె.నాయుడు- శ్రీ సుధ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది.
 
ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతని వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి శ్రీ సుధ పోలీసులను ఆశ్రయించింది. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే ఈ యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై శ్రీ సుధ సందేహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరి గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర్మ మాట‌ల‌కు రెచ్చిపోయిన‌ అప్స‌రారాణి