Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నిహిత వీడియోలు నా దగ్గరున్నాయి, నన్ను పెళ్లిచేసుకుంటే సరే, లేదంటే...

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (17:29 IST)
ప్రాణ స్నేహితుడు. ఏ పని కావాలన్నా ఇట్టే చేసి పెట్టేవాడు. ఇది నిజం కాదు. ఆమె కోసం నటించాడలా. అతడు ఎంతో మంచివాడని అతడితో స్నేహం కుదిరాక నమ్మించి ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేయబోయాడు. స్నేహితుడే ఇలా అఘాయిత్యం చేయబోవడంతో ఎలాగో అక్కడి నుంచి తప్పించుకున్నది ఆ యువతి. ఐతే అతడు అంతటితో వదల్లేదు. ఆమె పెళ్లి చేసుకోబోతోందని తెలిసి నేరుగా ఇంటికే వచ్చేశాడు.
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ భవానీపురంలో తన తల్లిదండ్రులతో కలిసి వుంటోంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి. లాక్ డౌన్ కావడంతో ఇంటి నుంచే పనిచేస్తోంది. ఐతే ఇంజినీరింగ్ చదివే సమయంలో మణికంఠ అనే యువకుడితో పరిచయమైంది. అతడు చాలా మంచిగా ప్రవర్తిస్తుండటంతో అతడితో స్నేహం చేసింది.
 
అదే అదనుగా తీసుకున్న మణికంఠ ఆమెకు సన్నిహితంగా వున్నట్లు ఫోటోలు తీశాడు. కొన్నిసార్లు వీడియోలు కూడా తీసుకున్నాడు. అదంతా స్నేహమే అనుకున్నది. కానీ ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. స్నేహితుడే కదా అని ఇంటికి వెళితే ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. దాంతో అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చేసింది.
 
 ఆ తర్వాత అతడితో దూరంగా వుంటోంది. ఉద్యోగంలో చేరి తన జీవితం తను గడుపుతోంది. ఇటీవలే ఆమెకి తల్లిదండ్రులు సంబంధం చూసారు. ఈ విషయం తెలుసుకున్న మణికంఠ మార్చి 25న ఆమె ఇంటికి వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలంటూ వాగ్వాదానికి దిగాడు. తనను చేసుకోపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. మళ్లీ ఏప్రిల్ నెలలో అదేవిధంగా చేయడమే కాకుండా తన వద్ద వున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడంతో బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని వాచిరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments