Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎత్తైన ట్యాంక్‍పై నిలబడి మందేసి చిందేసిన వ్యక్తి.. వీడియో వైరల్

Advertiesment
ఎత్తైన ట్యాంక్‍పై నిలబడి మందేసి చిందేసిన వ్యక్తి.. వీడియో వైరల్
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:21 IST)
Tank Dance
ఈ మధ్య ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ మద్యం సేవించిన వ్యక్తి డ్యాన్స్ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి మద్యం సేవించి వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కాడు. అక్కడ ఫన్నీగా డ్యాన్స్‌ చేస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో హోలీ రోజున ఈ సంఘటన జరిగింది. మద్యం సేవించిన ఒక వ్యక్తి సోమవారం 50 అడుగుల ఎత్తైన వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కాడు. అనంతరం తన మొబైల్‌లో సాంగ్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేయసాగాడు.
 
దీనిని చూసిన స్థానికులు ఆ వ్యక్తి కిందపడతాడేమోనని ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అతడు కిందకు దిగేలా చేశారు. ఆ వ్యక్తి గతంలో కూడా పలుమార్లు ఇలా చేసినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు కొందరు తమ మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ టీకాల ఎగుమతులపై నిషేధం లేదు : కేంద్రం