మంగళవారం నుంచి వారం రోజుల పాటు తెలంగాణ నిప్పుల కొలిమే...

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (09:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వారం రోజుల పాటు ఎండలు నిప్పుల కొలిమిగా మారనుంది. ఈ వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల మేరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 44 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments