మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ శుభయోగమే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. నోటీసులు అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. యోగ, ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పత్రాలు సమయానికి కనిపించవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. పట్టుదలకు పోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. అవివాహితులకు శుభయోగం. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. మితంగా సంభాషించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. సోమ, మంగళవారం దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత లోపం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవివాహితులకు శుభయోగం. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ధనమూలక సమస్యలు కొలిక్కివస్తాయి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహనిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగల్గుతారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త1,2 పాదములు
సంప్రదింపులతో తీరిక ఉండదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్ర వహించండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పెట్టుబడులకు అనుకూలం. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. సరుకు నిల్వలో జాగ్రత్త. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
తుల : చిత్త 3,4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. శనివారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులు మన్ననలు పొందుతారు. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. ఆదివారం నాడు పనులు ఒక పట్టాన పూర్తి కావు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కీలక పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. చేతివృత్తుల వారికి పనులు లభిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సన్నిహితుల సలహా మీపై సత్ ప్రభావం చూపుతుంది. ఆదాయం అంతంత మాత్రమే, మంగళ, బుధవారాల్లో పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా మెలగాలి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు కొత్త ఇబ్బందులెదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి, పొదుపునకు ఆస్కారం లేదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గురువారం నాడు విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. అవివాహితులకు యోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితమిస్తాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ప్రతికూలతలు తొలగుతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. త్వరలో శుభవార్తలు వింటారు. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యవసాయ కార్మికులకు పనులు లభిస్తాయి. విత్తన వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ధైర్యంగా వ్యవహరిస్తారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంస్థల స్థాపనలకు యత్నాలు సాగిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. చిరువ్యాపారులకు సామాన్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం.