Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chaturgrahi Yog 2023.. ఈ రాశులకు లాభం.. స్వాతి, తులారాశి వారికి?

moon
, శనివారం, 29 ఏప్రియల్ 2023 (12:16 IST)
ఈ ఏడాది మే 5న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం.. 12 ఏళ్ల తర్వాత అద్భుతమైన చతుర్గాృహి యోగంలో ఏర్పడుతుంది. 12 సంవత్సరాల తర్వాత సూర్యుడు, బుధుడు, గురువు, రాహువులు మేష రాశిలో ఉండనున్నాయి. 
 
ఈసారి చంద్ర గ్రహణం మే 5న తులా రాశి, స్వాతి నక్షత్రాలలో ఏర్పడుతుంది. ఈ చతుర్గాృహి యోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో డబ్బు వర్షం కురిపిస్తుంది. గ్రహణ సమయంలో మేష రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. అందుచేత మేష రాశి వారికి ఈ యోగం అనుకూలం. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో వ్యాపారంలో రెట్టింపు లాభం ఉంటుంది.
 
ఇంకా సింహ రాశి వారికి ఈ చతుర్గాృహి యోగం విశేష ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో ఆనందం, ఆదాయం, శ్రేయస్సు ఉంటుంది. అలాగే ధనస్సు రాశికి శుభప్రదం. ఆదాయ మార్గాలు లభిస్తాయి. కెరీర్‌లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. 
 
చతుర్గ్రాహి యోగంలో చంద్ర గ్రహణం ఏర్పడటం వల్ల ధన సంబంధిత సమస్యల నుంచి మీన రాశి వారు బయటపడతారు. కానీ ఈ ఈ చతుర్గాృహి యోగం ద్వారా తులారాశి వారు, స్వాతి నక్షత్ర జాతకులు జాగ్రత్త వుండాలి. ఈ కాలంలో ఖర్చు తప్పదు. ఆదాయానికి మార్గం అన్వేషించుకోవాలి. అదనపు ఖర్చులను తగ్గించాలి. డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి. ఇతరులకు డబ్బు సంబంధిత సాయాలు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో మే 3 నుంచి బ్రహ్మోత్సవాలు