నేటి నుంచి తెలంగాణాలో ఇంటింటికి జ్వర సర్వే

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (08:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఇంటింటికీ జ్వర సర్వే చేపట్టనున్నారు. ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రతి రోజూ వేలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇంటింటికి ఫీవర్ సర్వే చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దరిమిలా శుక్రవారం నుంచి జ్వర సర్వే (ఫీవర్ సర్వే)ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఆ తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఫీవర్ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తామన్నారు. జ్వరం ఉన్నవారికి అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌ కిట్లను కూడా పంపిణీ చేస్తామన్నారు. కరోనా రెండో దశ అల సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశంలోని పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోందని గుర్తుచేసిన మంత్రి హరీష్ రావు అనేక మందిలో ఈ లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని, 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పామని మంత్రి హరీష్ రావు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments