Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-01-2022 శుక్రవారం రాశిఫలితాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం

Advertiesment
21-01-2022 శుక్రవారం రాశిఫలితాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం
, శుక్రవారం, 21 జనవరి 2022 (04:00 IST)
మేషం :- ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. హోటల్, తినుబండారు వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు సంతానంతో, పనివారలతో చికాకులు తప్పవు.
 
వృషభం :- ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభాదయకంగా ఉంటుంది. విద్యార్థులు కళాత్మక, క్రీడాపోటీలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి.
 
మిథునం :- రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. విదార్జునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేసుకోవలసి వస్తుంది. మీ నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది.
 
సింహం :- భార్యా, భర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. యాదృచ్చికంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు తప్పవు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
కన్య :- ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. మీరు చేసే పనులకు బంధువులనుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. స్త్రీలు కళాత్మక పోటీలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు.
 
తుల :- వస్త్ర, వస్తు, బంగారు, వెండి వ్యాపారులకు లాభదాయకం. బంధువులను సహాయం అర్లించటానికి మొహమ్మాటం అడ్డువస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు యత్నంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
వృశ్చికం :- శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. నిరుద్యోగులు ఏ విషయాన్ని అలక్ష్యం చేయక ఆశాభావంతో శ్రమించిన సత్ఫలితాలు పొందగలరు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సంతానం లేనివారికి శుభవార్తలందు సూచనలు కలవు.
 
ధనస్సు :- స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. మీ తొందరపాటు నిర్ణయాన్ని మిత్రులలో వ్యతిరేకిస్తారు. 
 
మకరం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పలు తప్పవు. కాంట్రాక్టర్లు అతి కష్టంమ్మీద టెండర్లు చేజిక్కించుకుంటారు. మీ కళత్ర వైఖరి చికాకు, నిరుత్సాహం కలిగిస్తుంది. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సర్దుబాటు చేసుకుంటారు.
 
కుంభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లోనూ, సంఘంలో మీ మాటకు విలువ ఉండదు. విద్యార్థులకు తోటివారు, అధ్యాపకులతో చికాకులు అధికం. కోళ్ల, మత్స్య పాడి రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరుల సహాయం అర్థించటానికి మొహమ్మాటం అడ్డువస్తుంది.
 
మీనం :- ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమికుల అవగాహన రాహిత్యం అనర్ధాలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. తల పెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం లోపం వల్ల అవకాశాలు జారిపోయే ఆస్కారం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేడారం జాతరను ఎలా నిర్వహించాలి.. తెలంగాణ అధికారుల సమాలోచనలు