Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-01-2022 సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం....

Advertiesment
17-01-2022 సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం....
, సోమవారం, 17 జనవరి 2022 (04:00 IST)
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అసవరం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా మెలగాలి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మిత్రులను కలుసుకుంటారు.
 
వృషభం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాలయులకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మిథునం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. ప్రియతములు ఇచ్చే సలహ మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యం. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
సింహం :- విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదా పడతాయి. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలలో ఒత్తిడి, హడావుడి అధికమవుతాయి. కొంత మంది సూటిపోటి మాటలుపడటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు.
 
కన్య :- పెద్దల ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజీ ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యల పరిష్కారమవుతాయి.
 
తుల :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరి, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. స్త్రీ పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ధనం ఏమాత్రం నిలబెట్టలేక పోయినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు.
 
వృశ్చికం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. విద్యార్థులకు అధ్యాపకుల నుంచి ఒత్తిడి, ఏకాగ్రత లోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును. బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఒకానొక విషయాలో మీ చిత్తశుద్దిని ఎదుటివారు శంకించే అమాశం ఉంది.
 
మకరం :- హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు లాభదాయకంగా ఉంటుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి పని భారం అధికమవుతుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దూర ప్రయాణాలలో స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి.
 
కుంభం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గట్టిగా ప్రయత్నిస్తేనేకాని మొండి బాకీలు వసూలు కావు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు.
 
మీనం :- మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేయవలసి వస్తుంది. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయకండి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాలకు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-01-2022 ఆదివారం రాశిఫలితాలు - ఆదిత్యుని పూజించిన సర్వదా శుభం..