Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-01-2022 గురువారం మీ రాశి ఫలితాలు.. సాయిబాబా గుడిలో?

Advertiesment
Daily Horoscope
, గురువారం, 13 జనవరి 2022 (05:00 IST)
సాయిబాబా గుడిలో నిత్యం అన్నదానం చేసిన శుభం కలుగుతుంది. గణపతిని పూజించినా మీకు శుభం.
 
మేషం:- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. విందులు, వినోదాలలో పలువురిని ఆకట్టుకుంటారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం :- రిప్రజెంటేటిలు తమ టార్గెట్లు పూర్తి చేస్తారు. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. రవాణా రంగాల వారికి చికాకులు అధికం. ఆస్తికి సంబంధించిన విషయాల్లో సోదరులు మీతో ఏకీభవిస్తారు. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు అధికమవుతాయి. చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం.
 
మిధునం:- కుటుంబీకలతో కిలకమైన విషయాలు చర్చలు జరుపుతారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ఉపాధ్యాయులు చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్ర వ్యాపారులకు పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం: - స్త్రీల తొందరపాటుతనం వల్ల యిబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక విషయంలో మిత్రుల తీరు మీకెంతో నిరుత్సాహం కలిగిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలిస్తాయి.
 
సింహం: - మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. ఉద్యోగసులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్లిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటాయి.
 
కన్య:- మీ సంతానం ఆరోగ్యం , విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి పని ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. వస్త్రాలు, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి.
 
తుల: - దైవ, సేవ, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. హామీలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, పనిభారం తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమానంతో ఏకీభావం లోపిస్తుంది. నూతన వ్యాపారాలుచేపట్టాలనే మీ ఆలోచన బలపడుతుంది.
 
వృశ్చికం:- మీ ప్రత్యర్థుల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుండటం శ్రేయస్కరం. ప్రేమికులు అతిగా వ్యవహరించి భంగపాటుకు గురవుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు ఏకాగ్రత లోపం, వ్యాహాలు అధికం కావటంతో చికాకులకులోనవుతారు.
 
ధనస్సు: - కొంత మంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
మకరం:- ఎట్టి పరిస్థితిలోను ఎదుటివారికి చనువు ఇవ్వటం మంచిది కాదని గమనించండి. విద్యార్థులకు వాహనం నడుపుతు న్నపుడు ఏకాగ్రత అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. ప్రతి విషయం మీ కుటుంబీకులకు తెలియచేయటం మంచిదని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కుంభం:- మీ మాటకు కుటుంబలోను, సంఘంలోను గౌరవం లభిస్తుంది. విలాసాలకు ధనం నిగినిగా వ్యయం చేస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం:- విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటన లెదురవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారు అండగా నిలుస్తారు. మీ యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం. రావలసిన ధనం వసూలు కాగలదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కోటి ఏకాదశి: సకల అలంకరణలు చేసుకుని శ్రీ మహావిష్ణువు వస్తాడు, అందుకే...