Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-01-2022 గురువారం రాశిఫలితాలు - శ్రీ సాయిబాబా స్తోత్రం పఠించినా...

Advertiesment
Daily Horoscope
, గురువారం, 20 జనవరి 2022 (04:00 IST)
మేషం :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలదార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలకు అస్వస్థత, నీరసం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. మార్కెట్లు రంగాల వారు తమ టార్గెట్టును పూర్తిచేస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి.
 
వృషభం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన మెచర్లు ఏమంత సంతృప్తినీయవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. మీ కళత్రమొండి వైఖరి మీకు ఎంతో నిరుత్సాహం, ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
మిథునం :- కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. స్త్రీలపై సెంటిమెంట్లు, పొరుగువారి మాటల ప్రభావం అధికం. ఉద్యోగస్తులు పెండింగ్ పనుల పై దృష్టి సారిస్తారు.
 
కర్కాటకం :- బంధువుల రాక వల్ల మీ పనులు, రోజువారీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తి కావు. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి.
 
సింహం :- పాత రుణాలు తీర్చగలుగుతారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మార్కెట్టు రంగాల వారు తమ టార్గెట్టును పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు స్వల్ప లాభాలు గడిస్తారు. వాహనచోదకులకు జరిమానాలు, మరమ్మతులు వంటి చికాకు లెదురవుతాయి.
 
కన్య :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గృహం కొనుగోలు చేయు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. ఇతరుల వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
తుల :- ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. కొన్ని వివాదాలకు సంబంధించిన చర్చలు సఫలమవుతాయి. ఉద్యోగులు కొంత మేరకు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. తొందరపాటు తనం వల్ల ధననష్టంతోపాటు వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
ధనస్సు :- ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువుల రాకతో గృహం కళకళలాడుతుంది. కళ, క్రీడా పోటీల్లో రాణిస్తారు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. వ్యాపార రహస్యాలు, ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి.
 
మకరం :- ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో కలసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వైద్యరంగాల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది.
 
కుంభం :- దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీ ప్రయాణాలు వాయిదాపడతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి పురోభివృద్ధి. 
 
మీనం :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బిల్లులు చెల్లిస్తారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తు పట్ల మరింత శ్రద్ధ అవసరం. స్త్రీల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశాలు లభిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజవాడ కనకదుర్గ ఆలయంలో శఠారి ఆశీర్వాదం నిలిపివేత, ఆర్జిత సేవలు కూడా..?