Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర

Advertiesment
Medaran jatara
, గురువారం, 20 జనవరి 2022 (20:04 IST)
ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర జరుగనుంది. మేడారంలో మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. దీనికి కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
రెండేళ్లకోసారి జాతర జరుగుతుంటుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వస్తుంటారు. 
 
ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు. 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. 18న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం ఉంటుంది. 19న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
 
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ చెబుతూ, భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. జాతరకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. భక్తులందరూ మాస్క్ లు ధరించి రావాలని ఆమె సూచించారు. ప్రభుత్వం తరఫున మాస్క్ లను భక్తులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 12,615 పాజిటివ్ కేసులు - విశాఖలో ముగ్గురు మృతి