Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల కొత్త పార్టీ : ఆమోదం తెలిపిన ఈసీ.. జూలైలో విధి విధానాలు...

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (14:58 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల ఎట్టకేలకు రాజకీయ పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఆమె తన పార్టీకి నామకరణం చేశారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వాడుక రాజగోపాల్‌ కొత్త పార్టీ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. 
 
ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని ఓ జాతీయ పత్రికలో ప్రకటన ఇచ్చారు. పార్టీ తరపున ఈసీకి వచ్చిన అప్లికేషన్ పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.
 
తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం ఈ గుర్తింపునిచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
 
ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజైన జూలై 8వ తేదీన ఆమె పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాన్ని ప్రకటించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. 
 
అయితే, ఆమె పెట్టబోయే పార్టీ పేరు ఏంటనే చర్చ ఆసక్తికరంగా మారింది. తాజాగా వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు బయటికి వచ్చింది. ఎన్నికల సంఘం వద్ద షర్మిల పార్టీ పేరును నమోదు చేయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments