Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీ డీజీకి ఆర్ఆర్ఆర్ లాయర్ నోటీసు

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (14:52 IST)
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు సమయంలో ఆయన ఐఫోన్‌ను ఏపీ సీఐడీ పోలీసులు తీసుకున్నారు. ఈ ఫోనును ఇవ్వాలంటూ వారికి రఘురామ రాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌ను ఉద్దేశిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. 
 
తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తిరిగిచ్చేయాలని కోరారు. స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని రఘురామ ఆరోపించారు. ఆ ఫోనులో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
 
పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోనులో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందని స్పష్టంచేశారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోనును అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మంగళగిరి సీఐడీ హెచ్ఎస్ఓకు ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments