Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు
, శుక్రవారం, 4 జూన్ 2021 (21:53 IST)
హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియాకు దాతృత్వ విభాగమైన హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌) నేడు 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో పాటుగా 50 బిపాప్‌ మెషీన్లను తెలంగాణా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ సోమేష్‌కుమార్‌తో పాటుగా తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (ఐ అండ్ సీ) మరియు ఇన్‌ఫర్మేఫన్ టెక్నాలజీ (ఐటీ) శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్‌లకు అందజేసింది.
 
వీటిని రాష్ట్రంలోని పలు ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు. అదనంగా, సమాజానికి పెద్ద ఎత్తున మద్దతునందిస్తూ, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ ఓ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను సైతం ఏర్పాటుచేయబోతుంది.
 
హ్యుందాయ్‌ కేర్స్‌ 3.0 కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్‌ బ్యాక్‌ టు లైఫ్‌, అత్యంత క్లిష్టమైన ఆక్సిజన్‌ ఉత్పత్తులను సమకూర్చుకోవడంతో  పాటుగా పంపిణీ చేస్తామనే భరోసా అందిస్తూ భారతదేశ వ్యాప్తంగా తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలు, నగరాలకు తక్షణ ఉపశమపనం అందిస్తుంది.
 
హ్యుందాయ్‌ కేర్స్‌ 3.0 కోవిడ్‌ ఉపశమన కార్యక్రమం కింద హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌, అత్యంత కీలకమైన వైద్య యంత్ర సామాగ్రిని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. తద్వారా అత్యంత వేగవంతంగా ఉపశమన మెటీరియల్‌ను తెలంగాణా, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా, న్యూఢిల్లీలో అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలోని ఆస్పత్రులకు అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పైన భారీ ఆఫర్