Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పైన భారీ ఆఫర్

Advertiesment
huge offer
గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది.

ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు అందుబాటులో ఉంది. దేశంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.808-850 వరకు ఉంది. అయితే పేటిఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 10 నుంచి రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. మీకు కనుక అదృష్టం ఉంటే గ్యాస్ ఉచితంగానే లభించవచ్చు. అయితే, ఈ ఆఫర్ మొదటి సారి పేటీఎం నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. పేటీఎం ద్వారా ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే
 
మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో మీ డీలర్ షిప్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ నంబర్లను ఎంటర్ చేయాలి.
 
ఆ తర్వాత లావాదేవీల కోసం వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత 48 గంటలోపు స్క్రాచ్ కార్డు లభిస్తుంది. స్క్రాచ్ కార్డు ఓపెన్ చేసి ఎంత  క్యాష్ బ్యాక్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
 
అయితే ఈ ఆఫర్ మొదటి సారి గ్యాస్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే అని మరిచిపోవద్దు. మీకు రూ.10 నుంచి రూ.800 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. మీరు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కార్డు ఎక్స్‌పైరీ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#JuhiChawlaకు రూ. 20లక్షల జరిమానా.. 5జీ నెట్‌వర్క్‌పై టైమ్ వేస్ట్... అంతా పబ్లిసిటీ కోసమే!