Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. ప్రత్యేక యాప్ రెడీ.. రంగంలోకి సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (19:25 IST)
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. డ్రగ్స్ అనే పదాన్ని.. హైదరాబాద్‌లోనే వినపడకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. డ్రగ్స్‌ను ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. ఇందుకోసం డోప్ అనే యాప్ తెచ్చేందుకు టి సర్కార్ సిద్ధమైంది. 
 
డ్రగ్స్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ తెచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. డ్రగ్స్ కోసం ఆర్డర్ చేస్తే అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. 
 
కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో కొత్త యాప్‌ పనిచేయనుంది. నార్కొటిక్‌ యాక్ట్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులకు సంబంధించిన వివరాల్ని ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 746 పోలీస్‌స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠా ఎక్కడ పట్టుబడినా.. అతని సమాచారం తెలుసుకునేందుకు డోపమ్స్‌ వేదిక కానుంది. 
 
ఒక స్మగ్లర్‌ నార్కోటిక్ డ్రగ్ కేసులో చిక్కితే అతడి గత చరిత్రను అక్కడికక్కడే తెలుసుకునేందుకు ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు రెడీ అయ్యారు పోలీసులు.
 
శుక్రవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులతో సదస్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. 
 
ఈ సమావేశంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై అధికారుల మధ్య చర్చ సాగింది. ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల కేసుల్లో దోషులు ఎంతటి వారైనా, ఎంతటి వారైనా సరే శిక్షించాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments