భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చండ్రుగొండు మండలంలోని సుజాత నగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డి పల్లి మండలానికి వరినారు తీసేందుకు ఒక బొలెరో వాహనంలో బయలుదేరారు.
ఆ సమయంలో తిప్పనపల్లి వద్ద ఈ వాహనం వెళుతుండగా ఎదురుగా బొగ్గు లోడుతో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందుభాగం బాగాదెబ్బతిన్నది. దీంతో ముందు భాగంలో కూర్చొన్న కూలీల్లో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మరో ఇద్దరు మార్గమద్యంలో చనిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.