అభిమానంతో ఆస్తులు అమ్మి గుడి కట్టారు.. ఇపుడు అమ్మకానికి పెట్టారు...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (08:50 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆయనకు గుడి కట్టించారు. ఇందుకోసం తన ఆస్తులను సైతం అమ్ముకున్నారు. అలాంటి నేతలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన వారు... ఆ గుడిని, గుడిలోని విగ్రహానికి అమ్మకానికి పెట్టారు. ఈ ఘట తెలంగాణ రాష్ట్రంలోని దండేపల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దండేపల్లి గ్రామానికి చెందిన గుండ రవీందర్‌ అనే వ్యక్తి సీఎం కేసీఆర్‌కు వీరాభిమాని. తెరాస నేత. ఈయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆస్తులు అమ్మి, అప్పులు చేసి గుడి కట్టించారు. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 
 
ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం కేసీఆర్ విగ్రహం ముఖాన్ని సంచులతో కప్పివేశాడు. తీరా ఇప్పుడు విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డానని, వేల రూపాయలు అప్పులు చేశానని, కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో గుడి కట్టినా నన్ను పట్టించుకోవడం లేదంటూ.. ఆయన ఇటీవల తెరాసకు రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఉద్యమంలో చేసిన అప్పులు చెల్లించడం ఇబ్బందిగా మారిందని దీంతో విగ్రహాన్ని విక్రయించడానికి సిద్ధపడినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments