Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా స్నేహితుడి భార్యతో వెళ్లిపోతున్నా.. నాకోసం గాలించవద్దు.. భార్యకు భర్త లేఖ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (09:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యతో లేచిపోయాడు. పైగా, తన భార్యకు లేఖ రాసిపెట్టి మరీ వెళ్లిపోయాడు. తాను తన స్నేహితుడి భార్యతో వెళ్లిపోతున్నానని, అందువల్ల తన కోసం ఎవరూ గాలించవద్దంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, న్యూబోయిన్‌పల్లికి చెందిన అతుల్ (45) అనే వ్యక్తి ఓ వ్యాపారి. ఈయన వివాహమై భార్య కూడా ఉంది. ఈ క్రమంలో తన స్నేహితుడి భార్యపై మనసు పారేసుకున్నాడు. కాలక్రమంలో వారిద్దరి మధ్య విడదీయలేని బంధంగా మారిపోయింది. దీంతో ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. 
 
దీనిపై అతుల్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారేడుపల్లి ఎస్ఐ మోహన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో తన భార్యకు అతుల్ రాసిన ఓ లేఖ బయటపడింది. ఇందులో ఈ నెల 29వ తేదీన తాను షిర్డీ వెళుతున్నట్టు పేర్కొన్నాడు. ఆ మరుసటి రోజు నుంచి అతుల్ ఫోన్ స్విచాఫ్ అయింది. 
 
ఈ క్రమంలో అతని ఇంట్లో గాలించగా, సొంత భార్యకు రాసిన లేఖ లభ్యమైంది. అందులో తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండటానికి వెళ్తున్నాని, ఈ విషయం తన స్నేహితుడికి తెలుసని, తమను వెతకవద్దని ఆ లేఖలో ఉందని ఎస్ఐ చెప్పాడు. కాగా, తన భర్త రూ.10 లక్షల నగదును తీసుకెళ్లాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments