Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగూడెంలో విషాదం.. పురుగుల మందు తాగిన ప్రేమజంట

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:27 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట పురుగుల మందు సేవించింది. దీంతో అమ్మాయి ప్రాణాలు కోల్పోగా, అబ్బాయి ప్రాణాపాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం నెహ్రూన‌గ‌ర్‌లో జరిగింది. 
 
మృతురాలి పేరు బోడ శ్వేత‌(20)గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. కొన్నేళ్లుగా గుగులోత్ వెంక‌టేశ్ అనే యువ‌కుడిని ప్రేమిస్తోంద‌ని తెలుస్తోంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించగా, అందుకు పెద్దలు సమ్మతించలేదు. దీంతో వారిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ఈ దారుణానికిపాల్పడ్డారు 
 
కాగా, పురుగుల మందు తాగిన యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో స్థానిక ఆసుప‌త్రిలోని వైద్యులు చెప్ప‌డంతో అత‌డిని అక్క‌డికి మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఖ‌మ్మం ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments