Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు : గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:15 IST)
సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నిర్వహిస్తూ వస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఓ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినం జరుపుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, భారతదేశానికి ఆగస్టు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం 1947 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నిజాం సర్కార్ నుంచి తెలంగాణను భారత్ దేశంలో విలీనం చేశారు. అయితే సెప్టెంబర్ 17పై రాజకీయంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇది విమోచన దినోత్సవమా? విలీన దినోత్సవమా? లేక విద్రోహ దినోత్సవమా? అనే వివాదం నడుస్తోంది. 
 
బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం ఈరోజు విలీన దినోత్సవమని, కాంగ్రెస్ పార్టీ కూడా విలీన దినోత్సవమని అంటోంది. బీజేపీ మాత్రం విమోచనదినంగా చెబుతోంది. ఇప్పుడు గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ బీజేపీ నేతల హడావుడికి మద్దతు తెలిపినట్లుగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments