Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తిప‌క్ష‌నేత ఇంటిపైకి, నీ బులుగు గూండాల‌ని పంపావంటేనే...

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:01 IST)
ప్ర‌తిప‌క్ష‌నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాల‌ని పంపావంటేనే, తాడేప‌ల్లి కొంప‌లో ఎంతగా వ‌ణికి ఛస్తున్నావో అర్థం అవుతోంది అంటూ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుప‌డ్డారు.   ఇంత‌కంటే నువ్వు దిగ‌జార‌వ‌ని అనుకున్నప్ర‌తీసారీ, అధఃపాతాళంలోకి దిగ‌జారుతూనే వున్నావు. నీ తాడేప‌ల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూర‌మో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరం. ఆ వ‌చ్చే రోజు కూడా ఎంతో దూరంలేకుండా నువ్వే తెచ్చుకుంటున్నావు అని హెచ్చ‌రించారు. 
 
నీ గాలి హామీలు తేలిపోయాయి. నీ ముద్దులు పిడిగుద్దుల్లా ప‌డుతున్నాయి. జ‌గ‌న్ ది అంతా నాట‌కమ‌నీ జ‌నానికి తెలిసిపోయింది. జ‌నం తిర‌గ‌బ‌డే రోజు ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని, ఉలిక్కిప‌డి ప్ర‌తిప‌క్షంపైకి వాళ్ల‌నీ, వీళ్ల‌నీ పంప‌డం ఎందుకు? నువ్వే ఓ సారి వ‌చ్చిపోకూడ‌దా? మా పెద్దాయ‌న నీలాంటి క్రూర‌, నేర స్వ‌భావం  ఉన్నోడు కాదు. నువ్వు ముంచేయాల‌ని నిత్యం త‌పించే క‌ర‌క‌ట్ట ప‌క్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి..బొత్తిగా నీకు తెలియ‌ని అభివృద్ధి అంటే ఏంటి? కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఎలా తీసుకురావాలి? ఉపాధి-ఉద్యోగావ‌కాశాలు ఎలా పెంపొందించాలి? అనే అంశాలు చ‌క్క‌గా వివ‌రిస్తారు. కాదూ-కూడ‌దు ఇలాగే బ్లేడ్ బ్లాచ్‌ల‌ను వేసుకొచ్చేస్తానంటే, నీ స‌ర‌దాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కళ్ళకి వడ్డీతో సహా వడ్డిస్తాం...అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments