Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం ఇంటిపై దాడికి తెగబడిన వైకాపా కార్యకర్తలు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:27 IST)
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై అధికార వైకాపాకు చెందిన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. 
 
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పలని గొడవకు దిగారు. లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పెద్దపెద్ద రాళ్లు, కట్టెలతో దాడులకు పూనుకున్నారు. ఈ దాడిలో పలువురు టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే జోగి రమేష్ సమక్షంలో ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర చూస్తూ మిన్నకుండిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
మరోవైపు, చంద్రబాబు ఇంటిపై దాడి జరుగుతుందని తెలుసుకున్న అమరావతి పోరాట సమితి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. జెడ్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబుపైనే దాడికి దిగుతుంటే.. ఇక సామాన్యల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ దాడిని పోలీసులే ప్రోత్సహించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ దగ్గరుండి మరీ వైసీపీ నేతలను బాబు ఇంటి వద్దకు పంపారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments