Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్.వివేకా హత్య కేసులో టర్నింగ్ పాయింట్ : అతని అరెస్టుకు రంగం సిద్ధం

Advertiesment
YS Vivekananda Reddy
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (12:07 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. హత్య ఎలా జరిగిందో తాజాగా కల్పిత పాత్రలతో సీబీఐ అధికారులు వీడియో షూట్ చేశారు. ఈ క్రమంలో మరో నిందితుడికి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. 
 
ఈ హత్య కేసులో ఇప్పటికే సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేయగా మూడో నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు సీబీఐ వర్గాల సమాచారం. బుధవారం మధ్యాహ్నం గంగిరెడ్డిని పులివెందుల నుంచి కడపకు తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకూ విచారించి… ఆ తర్వాత కడప రిమ్స్‌కు తీసుకెళ్లి కరోనా సహా, ఇతర వైద్య పరీక్షలు చేయించారు. గురువారం పులివెందుల కోర్టులో హాజరుపరచనున్నారు. 
 
మరోవైపు, బుధవారం కూడా వివేకా ఇంట్లో సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేసిన సీబీఐ అధికారులు.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఎలా ఇంట్లోకి ప్రవేశించారు, ఎక్కడెక్కడ దాక్కున్నారు, గేటు తీసుకొని ఎలా వెళ్లారు, బైక్‌పై ఎవరెవరు వచ్చారు, హత్య జరిగిన తర్వాత ఎలా ఎస్కేప్ అయ్యారు వివరాలను పరిశీలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25 మందితో టీటీడీ పాలక మండలి... ఎమ్మెల్యే కాట‌సానికి కూడా!