Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివేకా హత్య కేసు: సీబీఐ అధికారుల సీన్ రీకన్​స్ట్రక్షన్‌

Advertiesment
వివేకా హత్య కేసు: సీబీఐ అధికారుల సీన్ రీకన్​స్ట్రక్షన్‌
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:59 IST)
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించి.. సీన్ రీ-కన్​స్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు.
 
 మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశాలైన బెడ్‌రూం, బాత్‌రూంను పరిశీలించారు. 
 
మరోసారి సీన్ రీ-కన్​స్ట్రక్షన్ చేశారు.  ఇంటి పరిసరాల కొలిచి.. వీడియో, ఫొటోలు తీశారు. హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు.  ఆరుగురు సీబీఐ అధికారులు టీషర్టులకు పేర్లు రాసి వారి ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. 
 
ఇద్దరు దుండగులు పల్సర్‌ బైకుపై వివేకా ఇంటి వద్దకు వచ్చినట్టు.. వారిలో ఒకరు గేటు తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయినట్టు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్​ చేశారు. 
 
మరో ముగ్గురు అధికారులు నిందితుల్లా ట్రయల్స్‌లో పాల్గొనగా.. వారు వివేకా ఇంటి ముందు నుంచి ఒకే బైకులో వెళ్లిపోవడాన్ని సీబీఐ వీడియో తీసింది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి హత్య జరిగిన రోజు పల్సర్ బైకులోనే వివేకా ఇంటికి వచ్చినట్టు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తెలిపారు. ఆ నేపథ్యంలోనే వారు ఎలా వచ్చి ఉంటారో ఊహిస్తూ సీబీఐ వీడియో తీసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టిస్తే రూ.పది లక్షలు : తెలంగాణ పోలీసుల ప్రకటన