తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికిమొన్న విశాఖ ఏజెన్సీలో ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు పూర్తిగా ఊడిపోయాయి. డ్రైవరు అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.