Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు లబ్దిదారులకు శుభవార్త - నగదుపై వడ్డీ చెల్లింపు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (11:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి దళితబంధు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పింది. దళిత బంధు పథకం అమలులో భాగంగా యూనిట్లు మంజూరయ్యేంత వరకు ప్రత్యేక ఖాతాల్లో నగదుపై వడ్డీని జమ చేయనున్నట్టు తెలిపారు. 
 
లబ్దిదారుల పేరిట ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ పథకం అమలులో భాగంగా, మూడు నెలల క్రితమే ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. తాజాగా నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారుడుకి కనీసం 8 నుంచి 9 వేల వరకు వడ్డీ రూపంలో నగదు అందుతుందని సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. 
 
కాగా, పథకం అమలులో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు దాని పరిధిలోని దాదాపు 20వేల మంది లబ్దిదారులు ఉంటారని అంచనా వేసింది. 
 
వీరిలో ఇప్పటికే 18 వేల మందికి రూ.10 లక్షలు చొప్పున రూ.1800 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. పాసాలమర్రిలో 76 మంది ఉంటారని అంచనా వేయగా, ఇప్పటికే 66 ఖాతాల్లో నగదు జమ చేసింది. బ్యాంకుల్లో లబ్దిదారుల పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాలను ఓపెన్ చేసి ఈ నిధులను జమ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments