Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ భేటీ: 19 నుంచి సీఎం జిల్లాల పర్యటన

Advertiesment
పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ భేటీ: 19 నుంచి సీఎం జిల్లాల పర్యటన
, శనివారం, 18 డిశెంబరు 2021 (11:27 IST)
పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రమంతా దళిత బంధు అమలుచేస్తామని.. మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని.. మిల్లర్లతో టై అప్ ఉన్నోళ్లు వరి వేసుకోనివ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు యథావిధిగా ఇస్తామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇంకా కొనసాగుతోంది.
 
ఇక శనివారం మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల 19 నుంచి సీఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం… శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది
 
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేసేందుకు టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులందరితో సీఎం కీలకభేటీ నిర్వహించారు. పార్టీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. నాయకులకు ఓపిక ఉండాలని, పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయని స్పష్టం చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించాడు.. ఎందుకో తెలుసా?