ఏపీ సర్కారుపై తెలంగాణ గరంగరం.. తాడోపేడో తేల్చుకుంటామంటూ...

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (08:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఏపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయింయింది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో సాగునీటి పారుదల రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించినా పట్టించుకోకపోవడాన్ని కేబినెట్ తీవ్రంగా పరిగణించింది. 
 
ఏపీ తీరుపై న్యాయస్థానాల్లోను, ప్రజా క్షేత్రంలోను తేల్చుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు, పార్లమెంటు సమావేశాల్లోనూ దీనిపై ప్రస్తావించాలని, ఏపీ ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో జరగబోయే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించనుంది.
 
ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయించాలని కోరాలని నిర్ణయించింది. ఏపీ ప్రాజెక్టుల కారణంగా హైదరాబాద్‌కు తాగునీరుతోపాటు పలు జిల్లాలకు సాగునీరు విషయంలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడిన కేబినెట్.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా నిర్ధారణ కాకపోవడంపై కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments