Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు..? కేసీఆర్ అత్యవసర భేటీ

Advertiesment
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు..? కేసీఆర్ అత్యవసర భేటీ
, శనివారం, 19 జూన్ 2021 (11:39 IST)
తెలంగాణలో శనివారం (జూన్ 19) తోనే లాక్‎డౌన్ ముగియనున్న నేపథ్యంలో కొవిడ్ పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా..? లేకుంటే నైట్ కర్ఫ్యూ విధించాలా..? అనే దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది. అయితే శనివారం చేయబోయే ప్రకటన ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రజానికంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో భేటీకి రావాల్సిందిగా మంత్రులకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. నిజానికి లాక్ డౌన్ పొడగింపు లేదా ముగింపునకు సంబంధించి శుక్రవారమే ప్రకటన వస్తుందని భావించినా, శనివారం జరగబోయే అత్యవసర కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారని ఆలస్యంగా వెల్లడైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 19న కరోనా వైరస్ పాజటివ్ బులిటెన్ - కొత్తగా 60,753 కేసులు