పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసే అరుదైన అవకాశం తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థికి లభించింది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో బీఏ చదువుతున్న శ్రీవర్షిణి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వడానికి ఎంపికయ్యారు.
అవకాశాలు తరుచుగా రావని, వాటిని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి శ్రీవర్షిణి తెలిపింది. సుభాష్ చంద్రబోస్ జాతీయవాద అభిప్రాయాల పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, ఆయనపై చాలా పరిశోధనలు చేశానని ఆమె చెప్పింది. ప్రధాని మోదీతో కలవాలన్న తన కల నెరవేరబోతోందని పేర్కొంది.