Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశపు అతిపెద్ద స్టూడెంట్‌ చాంఫియన్‌షిప్‌ విజేతలను వెల్లడించిన లీడ్‌

Advertiesment
image
, శుక్రవారం, 13 జనవరి 2023 (21:21 IST)
భారతదేశపు అతిపెద్ద స్కూల్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌, తమ లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022 విజేతలను వెల్లడించింది. లీడ్‌ పవర్డ్‌ స్కూల్‌ విద్యార్ధుల కోసం ప్రత్యేకమైన, జాతీయ స్థాయి వేదిక ఇది. లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022ను భారతదేశ వ్యాప్తంగా 3000కు లీడ్‌ భాగస్వామ్య స్కూల్స్‌లోని 1.2 మిలియన్‌ల 9వ తరగతి లోపు ప్రీ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులకు నిర్వహించారు. లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022 విజేతల వివరాల కోసం లీడ్ వెబ్ సైట్ చూడవచ్చు.
 
లీడ్‌ కో-ఫౌండర్‌, సీఈఓ సుమీత్‌ మెహతా మాట్లాడుతూ, ‘‘లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022 విజేతలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్దులతో  పోటీపడి విజయం సాధించడం సాధారణ అంశమేమీ కాదు. మరీ ముఖ్యంగా చిన్న పట్టణాల విద్యార్ధులు! వారి అంకితభావం, నమ్మకం, కష్టం, సహజసిద్ధమైన ప్రతిభకు ఈ చాంఫియన్‌షిప్‌ నిదర్శనంగా నిలుస్తుంది. లీడ్‌ విద్యార్ధుల సమగ్ర అభివృద్ధి ప్రయాణంలో భాగం కావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము’’ అని అన్నారు.
 
ప్రతిభ ఎడ్యుకేర్‌ స్కూల్‌కు చెందిన ఎస్‌ ముస్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ, ‘‘లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022లో విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. మా టీచర్ల మద్దతు, మార్గనిర్దేశనం కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. ఈ ఛాంపియన్‌షిప్‌‌కు సిద్ధం కావడం వల్ల మరింతగా కాన్సెప్ట్స్‌ను అర్ధం చేసుకోగలిగాను. అలాగే ఎలా మాట్లాడాలి, నా సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలో కూడా తెలుసుకున్నాను’’ అని అన్నారు
 
ప్రతిభ ఎడ్యుకేర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీ నాగార్జున మాట్లాడుతూ ‘‘మా విద్యార్ధి ఎస్‌ ముస్కాన్‌ లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022 వద్ద సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నాము. ముస్కాన్‌ కష్టం, అంకితభావానికి తగిన ప్రతిఫలమిది. తమ సహచర విద్యార్థులకూ స్ఫూర్తిగా ఆమె నిలిచింది. ఈ తరహా జాతీయ స్ధాయి పోటీలు కారణంగా వారు తమ ఆత్మవిశ్వాసం మెరుగుపరుచుకోగలరు. లీడ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం వల్ల భావి విద్యావసరాలను తీర్చే రీతిలో సిద్ధం కావడంలో సహాయపడింది’’ అని అన్నారు
 
లీడ్‌ చాంఫియన్‌షిప్‌ 2022 విజేతలకు 10 లక్షల రూపాయలకు పైగా విలువైన బహుమతులు లభించాయి. వీటిలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, గుడీస్‌ తదితరాలు ఉన్నాయి. దీనితో పాటుగా ప్రతిష్టాత్మక లీడ్‌ చాంఫియన్‌షిప్‌ ట్రోఫీ కూడా అందించారు. చిత్తూరులోని కామ్‌ఫోర్డ్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్‌ నుంచి కొల్తూరు సమీరను క్విజ్‌ చాంఫియన్‌ విభాగంలో ఫైనలిస్ట్‌గా డిక్లేర్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ సంక్రాంతి వేళ దక్షిణ భారతదేశంలో విమాన టిక్కెట్లు బుకింగ్‌: అత్యున్నత గమ్యస్థానంగా నిలిచిన విశాఖపట్నం