Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కారణంగా అనాథలైన చిన్నారులు.. ఎమెర్జెన్సీ నెంబర్లతో సెల్ ఫోన్లు

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (13:19 IST)
Orphans
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ముందుకు వచ్చింది. వారిని తమ ఆశ్రమాల్లోకి తీసుకుని సంరక్షిస్తోంది. ఇలా కేవలం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన వారు కొంతమంది రాష్ట్ర శిశు సంక్షేమశాఖ ఆశ్రమంలో ఉంటున్నారు. కాగా మరికొంతమంది తమ బంధువుల వద్ద సంరక్షింపబడుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 138 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. 
 
అయితే వీరందరికి ఎలాంటీ లోటు రాకుండా ఉండడడంతో పాటు వారికి ఎలాంటీ ఇబ్బంది వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేందుకు వారందరికి సెల్ ఫోన్‌లు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ సెల్‌ఫోన్‌లలో జిల్లాస్థాయి అధికారులతో పాటు, హెల్ప్‌లైన్, ఎమర్జెన్సీ నెంబర్లను ఫీడ్ చేసి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 
 
దీని ద్వారా వారు ఎప్పుడైనా.. అధికారులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వీరికి నెలవారి రేషన్, సరుకులు, సెల్ ఫోన్లు అందించేందుకు స్వచ్ఛంధ సేవ సంస్థల సహాకారం తీసుకోనున్నారు. స్కూళ్లు ప్రారంభం అయిన తర్వాత అందరని రెసిడేన్సియల్ స్కూళ్లలో చేర్పించేందుకు కరోనా మహమ్మారిన పడి తల్లితండ్రులను కోల్పోయిన చాలా మంది పిల్లలు అనాథలయ్యారు.
 
దీంతో వారి భాద్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.. ఇలా కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన వారికి మరింత చేయూత నివ్వడం ద్వార వాళ్లు నిర్భయంగా బ్రతకగలరనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments