Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. సెక్యూరిటీ లేని కవాచ్ పర్సనల్ లోన్

ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. సెక్యూరిటీ లేని కవాచ్ పర్సనల్ లోన్
, శనివారం, 12 జూన్ 2021 (09:51 IST)
కరోనా మహమ్మారితో ప్రజలు భాదపడుతున్న సమయంలో ఎస్‌బీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. కరోనా చికిత్స కారణంగా ఆర్థిక ఒత్తిడితో చితికిపోతున్న మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 'కవాచ్ పర్సనల్ లోన్' పేరుతో ఎటువంటి సెక్యూరిటీ లేని రుణాన్ని ప్రవేశపెట్టింది. కోవిడ్-19 చికిత్స కోసం తన, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం వినియోగదారులకు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ 8.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో 5 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. 
 
రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు సంవత్సరానికి 8.5% వడ్డీ రేటుతో ఎవరైనా లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ గరిష్ఠ గడువు చెల్లింపు కాలం 60 నెలలు. లోన్ తీసుకున్న మూడు నెలలు ఈఎమ్ఐ కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ కోవిడ్ సహాయక చర్యలకు అనుగుణంగా బ్యాంకులు అందిస్తున్న కోవిడ్ -19 లోన్ లలో 'కవాచ్ పర్సనల్ లోన్' కూడా ఒకటని ఎస్‌బిఐ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కను నోట కరుచుకుని వెళ్లిన చిరుత (Video)