Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను బొక్కలో వేయిస్తాం... : బండి సంజయ్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (09:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బొక్కలో వేయిస్తామంటూ బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. 
 
ఆయన గత కొద్దీ రోజులుగా పాదయాత్ర చేస్తూ తెరాస సర్కార్‌పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం సంజయ్.. ఇల్లంతకుంట బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను బొక్కలో వేయిస్తాం అంటూ హెచ్చరించారు. 
 
ధాన్యం కొనుగోలులో కేసీఆర్ బ్రోకర్ మాత్రమే.. కేంద్రమే పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని కామెంట్ చేసాడు. దళిత బంధు స్కీం కొత్తది కాదు.. ప్రధాని మోడీ ఏనాడో ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 
 
మరోవైపు.. అంబేద్కర్ గురించి మాట్లాడని సీఎం కేసీఆర్.. అంబేద్కర్ పుట్టి పెరిగిన ప్రాంతాలను పంచ తీర్థాలుగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందన్నారు.
 
తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల లాగా.. రాజాకార్ల లాగా యుద్ధానికి వస్తే నేను శివాజిలాగా కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తానని బండి సంజయ్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments