Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పశ్చిమబెంగాల్‌‌లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రశాంత్ కిషోర్

Advertiesment
పశ్చిమబెంగాల్‌‌లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రశాంత్ కిషోర్
, సోమవారం, 27 సెప్టెంబరు 2021 (13:51 IST)
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పశ్చిమబెంగాల్‌ భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటరుగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రశాంత్‌ కిషోర్‌ కీలక పాత్రపోషించారు. ఆయన ఇదివరకు బీహార్‌లోని ససారాం జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటరుగా ఉన్నారు. భవానీపూర్‌ అసెంబ్లీ ఎన్నిక సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌ కోల్‌కతాలో ఉండకుండా బయటకు తీసుకురావడానికి బీజేపీ ఎన్నికల కమిషన్‌ని బలవంతం చేయొచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పథకం​ ప్రకారం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
 
భవానీపూర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ అడ్వయిజర్‌గా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ ఓటరుగా నమోదు చేసుకోవడంపై బీజేపీ మీడియాసెల్‌ ఇన్‌చార్జ్‌ సప్తర్షి చౌదరి ఫైర్‌ అయ్యారు. 'చివరికి బహిరాగాటో (బయటివ్యక్తి) భవానీపూర్‌ ఓటర్‌ అయ్యారు. కాబట్టి, బెంగాల్‌ కుమార్తె ఇప్పుడు బహిరాగాటో (బయటి) ఓటర్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  
 
కిషోర్‌ను భవానీపూర్ ఓటర్‌ జాబితాలో చేరడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. కొద్ది రోజుల క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలుసుకున్నారు. దీంతో అతను కాంగ్రెస్‌లో చేరవచ్చు అనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అయితే ఆయన పార్టీలో చేరే నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని పార్టీ వర్గాలు సూచించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాభర్తల మధ్య గొడవ: భార్య ముక్కు కొరికేసిన భర్త