Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఎన్ని అసెంబ్లీ స్థానాలు.. ఓటర్లు ఎంతమంది? రౌండప్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (14:09 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబరు 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబరు 13న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు నవంబరు 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజున ఫలితాలను వెల్లడించారు. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,32,727 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,58,71,493 మంది పురుష ఓటర్లు కాగా, 1,58,43,339 మంది మహిలా ఓటర్లు ఉన్నారు. 2,557 మూడో కేటగిరీ ఓటర్లు (హిజ్రాలు) ఉన్నారు. వీరు కాకుండా సర్వీస్ ఓటర్లుగా మరో 15338 మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో వందేళ్లు దాటిన ఓటర్లు 7689 మంది ఉండగా, 80 యేళ్లు దాటినవారు 4.44 లక్షల మంది, 18, 19 యేళ్ళు దాటిన వారు 8.11 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.06 లక్షల మంది ఉన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 మంది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 19 షెడ్యూల్ కులాలు, 12 షెడ్యూల్ తెగలకు కేటాయించగా (రిజర్వు), మిగిలిన 88 అసెంబ్లీ నియోజకవర్గాలను జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. 
 
ఈ పోలింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 897 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 14,458 పోలింగ్ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగుల కోసం 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేవలం మహిళలు మాత్రమే నిర్వహించే పోలింగ్ కేంద్రాలు 597గాను, మోడల్ పోలింగ్ కేంద్రాలు 644 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ కు దిష్టి తీసిన కుటుంబసభ్యులు - అండగా వున్నవారికి థ్యాంక్స్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

సాయి కుమార్ కీ రోల్ చేసిన ప్రణయ గోదారి చిత్రం రివ్యూ

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments