Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో గ్రూపు - 2 పరీక్షలు వాయిదా

tspsc logo
, బుధవారం, 11 అక్టోబరు 2023 (08:35 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నవంబరు నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఆ నెలలో జరగాల్సిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు 2 పరీక్షలను వాయిదా వేశారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ సిబ్బంది బిజీగా ఉండటంతో ఈ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంటూ వాయిదా వేశారు. ఈ పరీక్షల నిర్వహణకు సరిపడిన సిబ్బందిని సమకూర్చుకోలేమని టీఎస్ పీఎస్సీతో సహా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు స్పష్టం చేయడంతో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు టీఎస్ పీఎస్సీ అధికారంగా వెల్లడించింది. వాయిదా వేసిన పరీక్షలను జనవరి నెలలో నిర్వహించే అవకాశముంది. 
 
మరోవైపు, ఈ పరీక్షల వాయిదాపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు నెలల్లో జరుగుతాయని చాలా క్రితమే స్పష్టత వచ్చినా హడావుడిగా నవంబరు నెలలో పరీక్షలు నిర్వహించేలా సిద్ధమవడం ఏంటని వారు ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఎన్నికల సమయంలో నిరుద్యోగ ఓటర్లను ఆకర్షించేందుకే ఈ తరహా నాటకమాడిందని వారు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమండ్రి జైలులో తీవ్ర ఉక్కపోత.. డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబు