శ్రీశైలంలో దారుణం.. చిన్న గొడవ.. నిండు ప్రాణాలు బలి..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (10:38 IST)
శ్రీశైలంలో దారుణం జరిగింది. చిన్న గొడవ ఏకంగా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంగళవారం శ్రీశైలం ఆర్డీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ సత్రంలో సిబ్బందికి, భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు  మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే..  గుంటూరు జిల్లా పిచ్చికలపాలెం గ్రామానికి చెందిన నలుగురు భక్తులు శ్రీశైలానికి వచ్చారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం సమయంలో కాకతీయ సత్రానికి వెళ్లారు. భోజనం వడ్డించమని సిబ్బందిని కోరగా.. వారు నిరాకరించారు. భోజన సమయం ముగిసిందని.. బఫే పద్ధతిలో మీరే వడ్డించుకోవాలని సత్రం ఇంచార్జి కందిమల్ల శ్రీనివాసరావు సూచించారు. ఆయన సమాధానంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాట జరిగింది. శ్రీనివాసరావును భక్తులు తోసివేయడంతో ఆయన కిందపడ్డారు. తలకు గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఐతే మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడించారు. మృతుడు శ్రీనివాసరావు స్వస్థలం గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం దండముడి గ్రామం. ఏడేళ్లుగా ఆయన శ్రీశైలంలోని సత్రంలో పనిచేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments