దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరిగే ప్యాసింజర్ రైళ్లు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. తాజాగా 22 ప్యాసింజర్ రైళ్ళను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అలాగే, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా మారుస్తూ దక్షణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 22 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా, 6 ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌లుగా మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి రానుంది.
కాజీపేట - సిర్పూరు టౌన్, సిర్పూరు టౌన్ - కాజీపేట, సిర్పూరు టౌన్ - భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ - సిర్పూరు టౌన్, గుంటూరు - నర్సాపూర్, నర్సాపూర్ - గుంటూరు, హైదరాబాద్ దక్కన్ - పూర్ణ, పూర్ణ - హైదరాబాద్ దక్కన్, హైదరాబాద్ దక్కన్ - ఔరంగాబాద్, ఔరంగాబాద్ - హైదరాబాద్ దక్కన్, నాందేడ్ - తాండూరు, తాండూరు - పర్బని, విజయవాడ - కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు - విజయవాడ, విశాఖపట్టణం - కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు - విశాఖపట్టణం, గూడూరు - విజయవాడ, విజయవాడ - గూడూరు, గుంటూరు - కాచిగూడ, కాచిగూడ - గుంటూరు, రాయచూరు - కాచిగూడ, కాచిగూడ - రాయచూరు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. శుక్రవారం నుంచి ఈ రైళ్లకు సంబంధించి కొత్త టైం టేబుల్ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.