పుస్తకం పట్టి గంటసేపైనా చదవమన్న తండ్రి.. కత్తెరతో గొంతు కోసిన కుమారుడు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (12:30 IST)
విద్యార్థులకు కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు జరిగినా చదువులకు చాలామంది విద్యార్థులు దూరంగా వున్నారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా వుంటూ పుస్తకం తాకని కుమారుడిని తండ్రి మందలించాడు. పుస్తకం పట్టి గంటసేపైనా చదువు అని మందలించాడు. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు యువకుడు పక్కనే ఉన్న కత్తెరతో తన తండ్రి మెడను పొడిచి చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపహాడ్​ గ్రామంలో బంటు ఎల్లయ్య(45), లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో కొడుకు నాగేందర్(19), కూతురు భవాని. నాగేందర్ ​సూర్యాపేటలో ఇంటర్​ ​సెకండ్​ ఇయర్ ​చదువుతున్నాడు. నాగేందర్ కి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఎల్లయ్య కొడుకును చదువుకోమని చెప్పాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త పెద్దదిగా మారింది. నాగేందర్ ​ఆవేశంలో కత్తెరతో తండ్రి గొంతులో పొడిచాడు.
 
ఎల్లయ్య అక్కడే రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే స్థానికులు వచ్చి ఎల్లయ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments